BHSV : విదేశాల్లో ఉంటున్నా సొంతగడ్డపై మమకారాన్ని చాటుకుంటున్నారు ప్రవాసీలు. భారతీయ పండుగలు, సంస్కృతిని పాటిస్తున్న ఎన్ఆర్ఐలు ఈసారి భారత్ హిందూ సేవా వేదిక (BHSV)తో హిందూ ధర్మ పరిరక్షణలో భాగం కానున్నారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతి విలువలను, సేవా దృక్పథాన్ని కొనసాగించడంతో పాటు సమాజంలో సామరస్యాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో దీన్ని స్థాపించారు.
భారత్ హిందూ సేవా ఆధికారిక ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు 5 మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు జరుగునుంది. మిడ్రాండ్లోని డ్రీమ్హిల్ ఇంటర్నేషనల్ స్కూల్, 78 లూరెన్స్ స్ట్రీట్, హాఫ్‌వే హౌస్, మిడ్రాండ్, 1685 వద్ద ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా శుభ ఘడియలో ఘనంగా సంస్థను ప్రారంభిస్తున్నందున.. వ్యవస్థాపక బృందాన్ని అధికారికంగా పరిచయం చేయనున్నారు.
భారత్ హిందూ సేవా వేదిక ప్రధాన బృంద సభ్యులు: కిరణ్ కుమార్ బెల్లి – సలహాదారు ఛైర్మన్, సాయి వినయ్ వడ్లమూరి – అధ్యక్షుడు, సుధీర్ బీమిరెడ్డి – ఉపాధ్యక్షుడు, ఫణి కాటూరి – ఉపాధ్యక్షుడు, జగదీష్ చింతనిప్పు – కోశాధికారి, కౌముది వేముల బీమిరెడ్డి – ప్రధాన కార్యదర్శి, లక్ష్మి ఐశ్వర్య ముమ్మిడివరపు – పీఆర్, మార్కెటింగ్ , సూర్య ముమ్మిడివరపు – సలహాదారు, సర్వేశ్ దాల్వి – ఈవెంట్ కోఆర్డినేటర్. కార్యక్రమానంతరం టీ, అల్పాహారం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
అదనపు సమాచారం కోసం వినయ్ వడ్లమూరి – 0847558876, కిరణ్ బెల్లి – 0744359390లను సంప్రదించాల్సిందిగా ఆర్గనైజర్స్ కోరారు.