Srisailam | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో బుధవారం కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 21 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా భక్తుల భక్తుల సౌకర్యాలను దృష్టిలో దేవస్థానం ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఈవో ఎం శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గంగాధర మండపం, పుష్కరణి, పాతాళగంగ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాతాళగంగలో పుణ్య స్నానాలు చేస్తారన్నారు. పాతాళగంగ పరిసరాలను, పాతాళగంగమెట్లను, ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తుండాలని పారిశుధ్య విభాగం అధికారులను ఆదేశించారు.
ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దేవస్థానం గత ఈతగాళ్లను నియమించింది. అక్కడి పాతాళగంగ పరిసరాల్లో, మెట్ల వెంబడి అవసరం మేరకు మరిన్ని విద్యుద్దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. శౌచాలయాలను నిరంతరం పరిశుభ్రంగా ఉండేవిధంగా నిర్వహిస్తుండాలని సూచించారు. గంగాధర మండపం వద్ద నిర్వహించనున్న కోటి దీపోత్సవం ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు కోటీ దీపోత్సవానికి తగు ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. పుష్కరణి, ప్రతీ సోమవారాలు, పౌర్ణమి రోజున జరిగే లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్ల చేయాలన్నారు. ఈవో వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహారెడ్డి, సహాయ కార్య నిర్వహణాధికారి మల్లికార్జునరెడ్డి, శ్రీశైల ప్రభ సంపాదకులు డాక్టర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.