IndiGo Flight | కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానాన్ని యూపీలో వారణాసిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో సాంకేతిక సమస్య లోపం తలెత్తింది. విమానం గాలిలో ఉన్న సమయంలో ఇంధన సమస్య తలెత్తినట్లుగా గుర్తించి అప్రమత్తమయ్యారు. విమానంలో ఇంధనం లీక్ అవుతున్నట్లుగా గురించి వారణాసిలోని ఎల్బీశాస్త్రి అంతర్జాతీయ విమానంలో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. కోల్‌కతా నుంచి టేకాఫ్ అయ్యాక ఫ్యూయల్ లీకేజీని పైలెట్లు గుర్తించారు. వెంటనే వారణాసి ఏటీసీని అత్యవసర ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. దాంతో ఎయిర్పోర్ట్ అధికారులు ల్యాండింగ్ కోసం రన్ వేను క్లియర్ చేశారు. దాంతో విమానం 4.10 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. ఈ సమయంలో విమానంలో దాదాపు 166 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే, సాంకేతిక లోపంపై అధికారులు విచారణ ప్రారంభించారు.