సింగపూర్ : బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో!! అంటూ ఆడబిడ్డలు అందరూ ఈ సంవత్సరం కూడా సింగపూర్ లో బతుకమ్మ పండగను పెద్ద ఎత్తున జరుపుకోవటానికి ప్రతి ఇంటి నుంచి కదలి రానున్నారు. ఒక్కొక్క పువ్వును శ్రద్దతో రాశులుగా పేరుస్తూ ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సుల కోసం ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా సింగపూర్ తెలుగు సమాజం (STS) ఆధ్వర్యాన తెలంగాణ గ్రామీణ సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ పండుగ అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 5గం నుంచి స్థానిక టాంపనిస్ సెంట్రల్ పార్క్లో జరుపుకోవటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
దసరా పండుగ ముందు వచ్చే వారాంతం కనుక కార్యక్రమానికి అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు కురిచేటి స్వాతి చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత గాయని వరమ్ ప్రత్యక్ష గానం ప్రత్యేక ఆకర్షణ అని, కార్యక్రమానికి హాజరు అయ్యే వారందరికీ పసందైన భోజన ఏర్పాట్లు చేస్తున్నామని అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
అంతేకాకుండా మొదటి 3 ఆకర్షణీయమైన బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు, ఒక లక్కీ విజేతకు 5 గ్రా బంగారం బహుమతిగా ఇస్తున్నామని కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ తెలిపారు. మరింత సమాచారం కోసం కింది వీడియోను చూడాలని నిర్వాహకులు తెలిపారు.
ప్రోమో వీడియో : https://youtu.be/0BWnuUJ7ol0