మలేషియా : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకనైన బతుకమ్మ వేడుకలు(Bathukamma celebrations) విశ్వవ్యాప్తంగా జరుగుతున్నాయి. విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలు మన సంస్కృతిని చాటిచెప్పేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. మలేషియాలో(Malaysia) రాజధాని కౌలాలంపూర్లో మలేషియా తెలంగాణ సంఘం (మైతా) ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో సుమారు 800 మంది ప్రవాస తెలంగాణ ఆడ బిడ్డలు పాల్గొని తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కోలాటం, బతుకమ్మ పాటలతో పండుగను జరుపుకున్నారు.
ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేష్ హెచ్ మణియాల్, హైకమిషన్ ఆఫ్ ఇండియా (కౌలలంపూర్) పాల్గొని మైతా చేస్తున్న సామాజిక కార్యక్రమాలను ప్రశంసించారు. భవిష్యత్తులో మైతాకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో మైతా ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ చిరుత చిట్టిబాబు, మహిళా ప్రెసిడెంట్ కిరణ్మయి, జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రావు, ట్రెజరర్ సందీప్ కుమార్ లగిశెట్టి, జాయింట్ ట్రెజరర్ సుందర్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సంతోష్ దాసరాజు, యూత్ వైస్ ప్రసిడెంట్ శివ తేజ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మారుతి, హరి ప్రసాద్, రాములు, రమేష్, మహేష్, శ్రీహరి, జీవం రెడ్డి, వినోద్, రఘుపాల్ రెడ్డి, రంజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.