ఆస్ట్రేలియా : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఆస్ట్రేలియాలో ప్రోత్సహించేందుకు కృషిచేస్తున్న ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘నమస్తే ఆస్ట్రేలియా’ ( ఫారెన్ ఫిల్లగాడు) ఆధ్వర్యంలో జరిగే గణేష్ మహోత్సవం 2025 పోస్టర్ను హైదరాబాద్లో మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాలోని తెలుగు సంఘానికి నిరంతరం సేవలందిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తూ, తెలుగు వారందరు కలిసి కట్టుగా ఉండి ఒక శక్తిగా ఉండాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పోస్టర్ ఆవిష్కరించిన తలసానికి నాగేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే ఆస్ట్రేలియా సంస్థ భారతీయ వారసత్వాన్ని కొత్త తరాలకు చేరవేస్తూ, ఉత్సవాలు, కమ్యూనిటీ సేవా కార్యక్రమాలు, యువత ఆధ్వర్యంలోని అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అనుసంధాన వేదికగా సేవలందిస్తోంది.