NRI | మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సామాజిక బాధ్యత గొప్పది : అనిల్ కూర్మాచలం
మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సామాజిక బాధ్యత ఎంతో గొప్పదని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు.
లండన్ : మాజీ ఎంపీ సంతోష్ కుమార్ సామాజిక బాధ్యత ఎంతో గొప్పదని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లండన్లో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అవార్డును’ అందుకొనే ముందు మొక్కలు నాటి, అంబేద్కర్ హౌస్ ని సందర్శించడం ఎంతో స్ఫూర్తినిచ్చింది. హరిత ఉద్యమాన్ని ఓ బాధ్యతగా భావించి ఆ దిశగా లక్షలాది మంది మొక్కలు నాటేలా ప్రభావితం చేసిన సంతోష్ కుమార్కు బ్రిటన్ పార్లమెంట్లో అరుదైన గౌరవం దక్కడం సంతోషంగా ఉందన్నారు.
పర్యావరణ సంరక్షణ కోసం పాటుపడిన వారి కోసం ఉద్దేశించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ అందుకోబోయే ముందు సంతోష్ కుమార్ లండన్ లోని బర్కీలీ గార్డెన్ లో మొక్కను నాటాడమే కాకుండా సంఘ సంస్కర్త, భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ హౌస్ ని లండన్ లో సందర్శించి వారికి నివాళులు అర్పించారు. సమాజం పట్ల ముఖ్యంగా అంబేద్కర్ పట్ల వారికున్న గౌరం ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు.
అన్ని సందర్భాల్లో తానూ నమ్మిన పర్యావరణ సంరక్షణ, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విలువలు ఎప్పటికి మరువకుండా తన జీవన విధానంలో ఆచరించడం గొప్ప విషయమని అనిల్ కూర్మాచలం తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవ, ఇగ్నీట్ మైండ్స్ సంస్థ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి, గణేష్ కుప్పాల, రవి పులుసు, సురేష్ గోపతి, పవన్ కళ్యాణ్, తరుణ్ లూనావత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

