ఎన్నారైలంతా సీఎం కేసీఆర్ వెంటే : మహేష్ బిగాల
మహేష్ బిగాల | సీఎం కేసీఆర్ కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకోవడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకోవడం సంతోషంగా ఉందని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ఎన్నారైలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని తెలిపారు. ఇన్నాళ్లు టీఆర్ఎస్లో ఉండి విపక్షాలతో మమేకమైన ఈటల రాజేందర్‌పై మహేష్ బిగాల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమనా ఎన్నారైలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.
ఈటల వ్యవహారంలో యూఎస్ఏ ఎన్నారైల కోర్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్లోనే ఉంటూ పార్టీని కూల్చాలని విఫల యత్నం చేశారన్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేమంతా కట్టుబడుతామన్నారు. సీఎం కేసీఆర్ ఏది చేసినా రాష్ట్రం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారని గుర్తు చేశారు.
సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ కేసీఆర్ నాయకత్వం పై విశ్వాసం వ్యక్తపరుస్తూ ఎన్నారైలు సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
సమావేశంలో టీఆర్ఎస్ యూఎస్ఏ కోర్ కమిటీ సభ్యులు మహేష్ తన్నీరు, చందు తాళ్ల, పూర్ణ బైరి, శ్రీనివాస్ గనుగొని, వెంగల్ జలగం, భాస్కర్ పిన్న, మహేష్ పొగాకు, రిషికేష్ రెడ్డి, వెంకట్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి : హాలియా ఏడీఏ సరిత
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా చిక్కిన కీసర ఎస్సై
హౌసింగ్ ఏఈ ఉదయ్‌కిరణ్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సన్మానం
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

