Job news: రైట్స్ లిమిటెడ్లో 48 ఇంజినీర్ పోస్టులు
ఇంజినీర్ | రైల్వే శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైట్స్ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: రైల్వే శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైట్స్ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 48 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సివిల్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 25 వరకు అందుబాటులో ఉంటాయి.
మొత్తం పోస్టులు: 48
ఇందులో సివిల్ ఇంజినీర్ 25, మెకానికల్ ఇంజినీర్ 15, ఎలక్ట్రికల్ ఇంజినీర్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్)లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. అభ్యర్థులు 32 ఏండ్లలోపు వయస్సు కలిగిఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.300
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 25
వెబ్సైట్: http://www.rites.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

