న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు ఉత్పత్తి సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 12 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఇందులో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ట్రైనీ, జియో సైన్సెస్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అయితే ఈ పోస్టులను గేట్-2020 ద్వారా భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 313
ఇందులో ఏఈఈ మెకానికల్ (సిమెంటింగ్) 6, పెట్రోలియం 1, సివిల్ 18, డ్రిల్లింగ్ 28, ఎలక్ట్రికల్ 39, ఎలక్ట్రానిక్స్ 5, ఇన్స్ట్రుమెంటేషన్ 32, మెకానికల్ 31, ప్రొడక్షన్ (మెకానికల్) 21, ప్రొడక్షన్ (కెమికల్) 16, ప్రొడక్షన్ (పెట్రోలియం) 12, కెమిస్ట్ 15, ఇండస్ట్రియ్ ఇజినీరింగ్ 3 జియాలజిస్ట్ 19, జియో ఫిజిజిస్ట్ 36, మెటీరియల్ మేనేజ్మెంట్ ఆఫీసర్ 12, ప్రోగ్రామింగ్ ఆఫీసర్ 5, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 7 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవాలి. గేట్ 2020లో అర్హత సాధించి, 28 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 12
వెబ్సైట్: https://ongcindia.com/