మాక్లూర్, జనవరి 18: కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేస్తున్న ముద్ర రుణాలను చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు. మండలంలోని బొంకన్పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్పయాత్ర’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జైక్రాంతి, సర్పంచ్ సాయమ్మ, ఉపసర్పంచ్ సాంగి గంగాధర్ కుర్మ, ఎంపీటీసీ పూజిత, ఏవో పద్మ, ఏపీవో ఓంకార్, ఏపీఎం అనిల్‌కుమార్, సూపర్ వైజర్ శ్రీప్రియ, బ్యాంకు మేనేజర్లు, వైద్యాధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.