ఎల్లారెడ్డి రూరల్: మార్చి 2న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే యుద్ధభేరి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీఎస్ సీపీఎస్టీయూ(CPSTU President ) జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి (Yellareddy) , ఉపాధ్యక్షుడు గులాం శాకీర్ (Ghulam Sakir) పిలుపునిచ్చారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో జరుగుతున్న కాంప్లెక్స్ సమావేశంలో యూపీఎస్ పై యుద్ధభేరి గోడప్రతులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే యూపీఎస్ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గోడ ప్రతుల ఆవిష్కరణ కార్యక్రమంలో డివిజన్ బాధ్యులు అనిల్ కుమార్, వేణుగోపాల్, విశ్వనాథం, శివకుమార్, దుర్గయ్య, జ్ఞానేశ్వర్, సంగ్యా, మల్లిబాబు తదితరులున్నారు.