Armoor | ఆర్మూర్ టౌన్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసీపీ వెంకటేశ్వర్లు రెడ్డి, సీడీపీవో భార్గవి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఏసీబీ వెంకటేశ్వర్లు రెడ్డి, ఆర్మూర్ సీడీపీవో భార్గవి హాజరై మాట్లాడుతూ యువత చదువే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నత చదువులు చదవాలని కోరారు.
యువత మత్తు సేవించి తమ శరీరాన్ని అనారోగ్యం పాలు చేసుకుంటున్నారన్నారు. యువత మత్తు ముసుగులో పోకుండా విద్యను క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు చేరి తల్లిదండ్రుల పేరుతో పాటు కళాశాలలో పేరును తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, అంగన్వాడీ సూపర్వైజర్లు విద్యార్థులు పాల్గొన్నారు.