కోటగిరి : హిందూ సామ్రాజ్య స్థాపన కోసం పోరాడిన యోధుడు ఛత్రపతి శివాజీ (Shivaji) ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ( MLA Pocharam Srinivas Reddy) అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా కోటిగిరి(Kotagiri Mandal) మండలం సుద్దులం గ్రామంలో బుధవారం శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు. భారతదేశం గర్వించదగ్గ చరిత్రను సృష్టించిన మహావీరుడని కొనియాడారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించారని, మహిళకు రక్షణ కల్పించారని పేర్కొన్నారు. సుద్దులం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ విగ్రహ దాత పోచారం సురేందర్ రెడ్డి, మండల నాయకులు మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, స్థానిక మాజీ సర్పంచ్ గోపు సాయిలు, బాబన్న, ఏజాజ్ ఖాన్,దత్తు పటేల్, సోపాన్. సుధాకర్,శివాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.