ఖలీల్‌వాడి/బోధన్, నవంబర్ 21 : నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో పెద్ద సంఖ్యలో యువతీయుకు లు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యువత ఎమ్మెల్సీ కవితకు తల్వార్‌ను బహూకరించారు. యువతీయువకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ వచ్చి న తర్వాతే నగరం అద్భుతంగా తయారైందని తెలిపారు.
బోధన్ నియోజకవర్గంలోని పలు పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో బోధన్ ఏఎంసీ మాజీ చైర్మన్ ఎండీ ఆబేద్ అలీ, మాజీ కౌన్సిలర్ మీర్ వహీద్ అలీ, రెంజల్ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు తిరుపతి హన్మాండ్లు (బుజ్జి) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెంది న సింగిల్‌విండో మాజీ చైర్మన్ చిక్కెల లక్ష్మణ్ స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో పార్టీలో చేరారు. లక్ష్మణ్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జాన్కంపేట్ గ్రామానికి చెందిన నాయకులు జయవర్ధన్, సుంకరి రాజా గౌడ్, అమ్జద్‌తో పాటు పలువురు ఉన్నారు.