Bear Attack | సిరికొండ : సిరికొండ మండలంలోని లొంక తాండకు చెందిన బానావత్ అరవింద్ పై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. అరవింద్ మేకలు మేపేందుకు లొంక సమీప అటవీ ప్రాంతంలోని మైసమ్మ వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఎదురైన ఎలుగుబంటి అతడిపై దాడి చేయడంతో ఎడమ భుజం భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన అరవింద్‌ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అటవీ ప్రాంతాలకు వెళ్లే పశువుల కాపరులు, తునికి ఆకు తెంపే సమయంలో జాగ్రత్తగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.