వినాయక్‌నగర్, ఏప్రిల్1: ఆన్లైన్ బెట్టింగ్ ఒకరి ప్రాణం తీసింది. ఆన్లైన్ బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోయిన ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూర్‌లో చోటుచేసుకున్నది. యువకుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిజామాబాద్ రూరల్ మండల పరిధిలోని ఆకుల కొండూర్ గ్రామానికి చెందిన లక్ష్మి, గంగారాం దంపతుల కుమారుడు ఆకాశ్ (25) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండేవాడు. సదరు యువకుడు మూడు, నాలుగేండ్ల నుంచి ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడ్డాడు.
తరచూ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పెట్టి సుమారు రూ. 3 లక్షల వరకు నష్టపోయాడు. తాజాగా మార్చి 27న సైతం బెట్టింగ్ యాప్‌లో మరో రూ.25 వేలు నష్టపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆకాశ్ అదే రోజు పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆకాశ్‌కు భార్య పద్మ, ఐదు నెలల బాబు ఉన్నాడు. మృతదేహాన్ని ప్రైవేట్ దవాఖాన నుంచి ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు రూరల్ ఎస్సై మహ్మద్ ఆరీఫ్ తెలిపారు.