గాంధారి, నవంబర్ 9 : ఇష్టం లేని పెండ్లి చేస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గాంధారి ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం.. మండలంలోని జువ్వాడి గ్రామానికి చెందిన ముచ్చర్ల సంపత్ (22)కు పెండ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
అయితే, తనకు ఇష్టం లేని పెండ్లి చేస్తున్నారని మనస్తాపానికి గురైన అతడు రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. శనివారం గ్రామశివారులోని వ్యవసాయ బావిలో మృతదేహం ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి మృతదేహాన్ని బయటికి తీయించి చూసి సంపత్‌గా గుర్తించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.