కోటగిరి, ఏప్రిల్ 6: శ్రీరామ నవమి పండుగ పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఆదివారం కోటగిరి మీదిగల్లీ నాయకుల ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు.
చుట్టు పక్కల ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి మల్లయోధులు తరలివచ్చి, కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతి అందజేశారు. పోటీలను తిలకించడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.