వినాయక్ నగర్ : మహిళలు సమాజంలో ముందుంటూ, అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరుచాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ( District Chief Justice ) సునీత కుంచాల ( Sunita Kunchala) తెలిపారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవంలో ( Womens Day ) ఆమె మాట్లాడుతూ ప్రపంచంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని దానికి అనుగుణంగా మహిళలు ఉన్నత చదువులు చదువుకొని , శక్తివంతులై అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని సూచించారు.
మహిళల ఆత్మ రక్షణ కోసం కరాటే లాంటి శిక్షణ తీసుకోవాలన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల నివారణకు చట్టాల మీద అవగాహన పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి కనకదుర్గ, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి ఆశాలత , రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ , డీఎల్ఎస్ఎ సెక్రటరీ పద్మావతి, న్యాయమూర్తులు కుష్బూ ఉపాధ్యాయ, చైతన్య బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వసంతరావు, ట్రెజరర్ దీపక్, లైబ్రరీ సెక్రటరీ పిల్లి శ్రీకాంత్, మహిళా న్యాయవాదులు కవితా రెడ్డి, నీరజ, పరిపూర్ణా రెడ్డి, రజిత, మానస, అపూర్వ, రమ, కల్పన, స్నేహ, అంజలి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.