Road Accident | ఎడపల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ సమీపంలోని అశోక్సాగర్ చెరువు కట్ట సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జానకంపేట గ్రామానికి చెందిన కమల (55) తన కుమారుడు అవిశత్తో కలిసి బైక్పై బంధువుల కర్మకాండకు వెల్మల్ గ్రామానికి బయలుదేరింది.
ఈ క్రమంలో జానకంపేట గ్రామ సమీపంలోని అశోక్ సాగర్ చెరువు కట్ట ప్రధాన రహదారిపై వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన లారీ వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కమల అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు అవిశత్ తీవ్రగాయాలపాలయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నిజామాబాద్ ఆరో టౌన్ పోలీసులు తెలిపారు.