Pocharam Srinivas Reddy | బాన్సువాడ, జూన్ 20 : బాన్సువాడను విద్య, వైద్య రంగానికి హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గం నసరుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ Bsc నర్సింగ్ కళాశాల భవన సముదాయ పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ తో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వ Bsc నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను ఉద్దేశించి పోచారం మాట్లాడుతూ రూ.40 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ Bsc నర్సింగ్ కళాశాల భవన సముదాయ పనులను త్వరితగతిన పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ నర్సింగ్ కళాశాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని, బాలికలకు విద్య ఎంతో అవసరం, విద్యతోనే సామాజికంగా, ఆర్థికంగా మార్పు వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంట్రాక్టర్, R&B అధికారులు మోహన్, కాంట్రాక్టర్ గౌరి శంకర్, సిబ్బంది అరవింద్ తదితరులు పాల్గొన్నారు.