Pocharam Srinivas Reddy | బాన్సువాడ, జూన్ 23 : గురుకుల పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారాం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి బీర్కూర్ మండల కేంద్రంలో గల మహాత్మాగాంధీ జ్యోతిబాపూలె బీసీ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం రూ.26 లక్షలతో నూతనంగా నిర్మించనున్న మరుగుదొడ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్సీవో సత్యనారాయణ రెడ్డి, ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి దుర్గం శ్యామల, పంచాయత్ రాజ్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.