ఉమ్మడి జిల్లాలో శనివారం విజయదశమి వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దసరా సంబురాలు జరుపుకొన్నారు. తొమ్మిది రోజులపాటు వివిధ అలంకారాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు శమీపూజ, ఆయుధ పూజ చేశారు.
ఒకరికొకరు జమ్మీ ఆకు ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పలు పట్టణాల్లో రావణ దహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఇందూరు ఆర్య సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో కర్రసాము, కోలాటాలు ఆకట్టుకున్నాయి.