మోర్తాడ్, జూలై 20: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీరెస్పీ నుంచి వెంటనే నీటి ని విడుదల చేసి, రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 15 టీఎంసీల నీరుందని, 4 టీఎంసీల నీటిని వదిలి పంటలను కాపాడుకోవాలని కోరారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిజామాబాద్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశానికి రాలేక పోయిన ప్రశాంత్‌రెడ్డి.. ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్రత్యేకాధికారి యోగితారాణకు లేఖ రాశారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో సమావేశం లో చర్చిండానికి లేఖలో కొన్ని సూచనలు చేశారు. ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ, కాకతీయ, లక్ష్మి కాలువలకు, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌస్‌కు 0.50 టీఎంసీల చొప్పున, గుత్ప లిఫ్ట్‌కు 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు.
జిల్లాస్థాయి సమావేశానికి సంబంధించి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి సమాచారం చేరవేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిసింది. సమావేశానికి సంబంధించి ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం మీటింగ్ ఉంటే, ఆదివారం సాయంత్రం సమాచారాన్ని అందించారని వేముల తెలిపారు. అయితే, సోమవారం వేరే కార్యక్రమాలు ముందే నిర్ణయించబడినందున సమావేaశానికి రాలేక పోతున్నందుకు విచారిస్తున్నానని మంత్రి కి, ప్రత్యేకాధికారికి పంపిన లేఖలో పేర్కొన్నారు. దీన్ని బట్టి ముందస్తు సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారన్నది తెలిసి పోతున్నది.
వ్యవసాయానికి కరెంటు సరఫరా తగినంత లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పుడు కేవలం 11 నుంచి 14 గంటల వరకే విద్యుత్ ఇస్తున్నారని, అందులోనూ 3, 4 సార్లు సరఫరాలో అంతరాయం కలుగుతున్నదన్నారు. కేసీఆర్ హయాం లో ఇచ్చిన మాదిరిగా 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు సరాఫరా విధానంలో భాగంగా కనీసం 18 గంటల పాటు నిరంతర సరఫరా చేయాలని కోరారు. అలాగే, ప్రభుత్వం భేషజాలకు పోకుండా ప్రాణహిత ద్వా రా గోదావరిలో కాళేశ్వరం దగ్గర వృథా గా సముద్రంలోకి పోతున్న నీటిని కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్ల ద్వారా ఎత్తిపోయాలని సూచించారు. వరద కాలువలో పోసి రివర్స్ పంపింగ్ ద్వా రా ఎస్సారెస్పీని నింపి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల రైతాంగానికి సాగునీటి కొరత లేకుండాచూడాలని కోరారు.