వానకాలం సీజన్ ప్రారంభానికి మరో నెల గడువు ఉండగానే వరినారు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలోనే ముందస్తుగా వరి సాగు చేసే ప్రాంతంగా పేరొందిన వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, బోధన్ తదితర మండలాల్లో రైతులు సాగు పనులను ప్రారంభించారు. వాతావరణ పరిస్థితులతోపాటు ముందస్తుగా వరి సాగు చేయడం ద్వారా కోతల సమయంలో అకాల వర్షాల బారినపడకుండా ఉండొచ్చని ఇక్కడి రైతులు పేర్కొంటున్నారు. చందూర్ మండల కేంద్రంలో యువరైతు చంద్రకాంత్ వ్యవసాయ క్షేత్రంలో వేసిన నారు ఏపుగా వస్తుండడంతో త్వరలోనే నాట్లు వేస్తానని చెబుతున్నారు.