కోటగిరి, మార్చి 1: ఇసుక తరలిస్తున్న వాహనాలు వేగంగా వెళ్లడం తో ఇండ్లలోకి దుమ్ము వసున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ వల్లభపూర్ గ్రామస్తులు శనివారం వాటిని అడ్డుకున్నారు. లారీలు, టిప్పర్లలో ఓవర్ లోడ్‌తో ఇసుకను తరలిస్తుండడంతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయ ని ఆగ్రహం వ్యక్తంచేశారు. మందర్నా మంజీరా నది నుంచి ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీలు, టిప్పర్లను గ్రామంలోకి రాగానే అడ్డగించారు.
రోడ్డుపై దుమ్ము లేస్తున్నదని, దుమ్ము రాకుం డా చర్యలు తీసుకోవాలని, లేదంటే వాహనాలను నడవనీయమని డ్రైవర్లను హెచ్చరించారు. ఈ విషయాన్ని డ్రైవర్లు నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో నిర్వాహకులు అక్కడికి చేరుకొని సమస్యను తెలుసుకున్నారు. దుమ్ము రాకుండా ఉదయం, సాయంత్రం రెండు పూటలా రోడ్డుపై నీటిని పట్టాలని గ్రామస్తులు తెలిపారు. వెంటనే ట్యాం కర్ ద్వారా రోడ్డుపై నీటిని పట్టించారు. దీంతో గ్రామస్తులు శాం తించి, వాహనాలకు అనుమతి ఇచ్చారు. సుమారు గంటపాటు నిరసన వ్యక్తంచేయడంతో పెద్ద సంఖ్య లో వాహనాలు నిలిచిపోయాయి.