పోతంగల్: నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గ గ్రామంలోని బీసీ కాలనీలో ద్విచక్రవాహనం చోరీకి (Two-wheeler Theft ) గురయ్యింది. గ్రామానికి చెందిన ఇందూరు గంగాధర్ అనే వ్యక్తి ఈనెల 14న కిరాణ షాప్ ఎదుట ద్విచక్రవాహానాన్ని నిలిపి ఉంచి మూడు గంటల తరువాత వచ్చి చూడగా బైక్ కనిపించలేదని బాధితుడు ఇందూరు గంగాధర్ తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సందీప్ తెలిపారు. ఈ వాహనాన్ని ఎక్కడైనా గుర్తిస్తే 8712659878 సమాచారం ఇవ్వాలని కోరారు.