నిజామాబాద్ : టీఎస్ ఆర్టీసీ (TS RTC) బస్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఓ కండక్టర్ మహిళకు టికెట్ ఇచ్చిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నిజామాబాద్ (Nizamabad) నుంచి బోధన్(Bodhan)కు వెళ్తున్న ఆర్టీసీ బస్‌లో కండక్టర్(Conductor) మహిళల వద్ద డబ్బులు వసూలు చేసి టికెట్ అందజేశాడు.
మహిళలకు ఉచిత ప్రయాణం ఉందని కండక్టర్‌తో వాధించినప్పటికీ ఆయన ససేమిరా అనడంతో ప్రయాణికుల్లో కొందరు కండక్టర్ వ్యవహారాన్ని సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీశారు. దీనిని ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంపించడంతో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వెంటనే స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. సంబంధిత కండక్టర్‌ను డిపోస్పేర్లో ఉంచామని వివరించారు. విచారణ అనంతరం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు.