ఖలీల్వాడి/ కామారెడ్డి, ఏప్రిల్ 22 : ఇంటర్ వార్షిక పరీక్షా ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఫలితాలు విడుదలవగా, రెండు జిల్లాల్లోనూ బాలికలు పైచేయి సాధించారు. నిజామాబాద్ జిల్లాలో ద్వితీయ సంవత్సరంలో 59.25 శాతం మంది (70శాతం మంది బాలికలు, 45 శాతం బాలురు) ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 53.37 శాతం మంది (64శాతం మంది బాలికలు, 41 శాతం బాలురు) మంది పాసయ్యారు.
జిల్లాలో ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సుల్లో పరీక్షలకు మొత్తం 13,495 మంది విద్యార్థులు హాజరు కాగా, 8,117 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 7,657 మంది హాజరు కాగా, 5,309 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 6,288 మంది పరీక్షలకు హాజరు కాగా 2,808 మంది పాసయ్యారు. రెండో సంవత్సరం ఒకేషనల్లో మొత్తం 2,042 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1,231 మంది ఉత్తీర్ణులయ్యారు.
మొదటి సంవత్సరం జనరల్ కోర్సుల్లో మొత్తం 15,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,035 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 8,074 మంది హాజరు కాగా, 5,191 మంది పాసయ్యారు. బాలురు 6,982 మంది పరీక్షలకు హాజరు కాగా, 2,844 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్లో మొదటి సంవత్సరంలో 1,111 మంది బాలికలు పరీక్షలకు హాజరు కాగా 756 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 1,679 మంది పరీక్షలకు హాజరు కాగా 467 మంది పాసయ్యారు.
కామారెడ్డి జిల్లాలో మొదటి సంవత్సరం (జనరల్)లో 6,828 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 3,343 మంది (48.96 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,119 మంది విద్యార్థులకు 1,169 (37.48 శాతం) మంది పాసయ్యారు. బాలికలు 3,709 మంది కి 2,174 మంది(58.61శాతం) ఉత్తీర్ణత సాధించారు.
రెండో సంవత్సరం (జనరల్)లో 6,485 మంది విద్యార్థులు పరీక్ష రాయగా,3,562 మంది (54.93 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,026 మందికి 1,347 మంది(44.51 శాతం) పాసయ్యారు. బాలికలు 3,459 మందికి 2,215 మంది (54.93 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ఒకేషనల్ మొదటి సంవత్సరంలో 1,912 మంది విద్యార్థులకు 1,035 మంది (54.13 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 934 మంది విద్యార్థులకు 327 మంది (35.01 శాతం) ఉత్తీర్ణత సాధించగా.. 978 మంది బాలికలకు 708 మంది (72.39 శాతం) పాసయ్యారు.
ద్వితీయ సంవత్సరంలో (ఒకేషనల్) 1,237 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 792 మంది (64.3 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 554 మందికి 222 మంది (40.07 శాతం), బాలికలు 683 మంది ఉండగా 570 మంది (83.46 శాతం) పాసయ్యారు. రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ఉత్తీర్ణతలో చివరి స్థానంలో నిలిచినట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.