డిచ్పల్లి, డిసెంబర్ 31 : మండలకేంద్రంలోని సీహెచ్సీలో డీఎంహెచ్వో డాక్టర్ తుకారాం రాథోడ్ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలకు ప్రథమ చికిత్సపై శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీవోడీటీటీ అధికారి డాక్టర్ నాగరాజు హాజరై మాట్లాడారు. అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించారు. సమీకృత ప్రాథమిక ఆరోగ్య సేవలు, చెవి, ముక్కు, గొంతు, కంటి సమస్యలపై వివరించారు. ప్రమాదాలు జరిగిన వారికి అందించాల్సిన ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీహెచ్సీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు స్వామి సులోచన, రాణి, పద్మలత, సుకన్య, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
చందూర్లో అంగన్వాడీ టీచర్లకు..
చందూర్ మండల కేంద్రంలో చందూర్, మోస్రా, వర్ని పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు ఐఎల్ఏపై శిక్షణ ఇచ్చారు. అంగన్వాడీ సూపర్వైజర్ మమత సెక్టార్ మీటింగ్తో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహార ఆవశ్యకత, నెలల వారీగా చేయించుకోవాల్సిన వైద్యం, తీసుకోవాల్సిన ఆహారం తదితర అంశాలపై అంగన్వాడీ టీచర్లకు సులభతరంగా అర్థమయ్యేలా చార్ట్ల ద్వారా అవగాహన కల్పించారు. నవజాత శిశువుల సంక్షేమానికి కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.