వినాయక్‌నగర్, అక్టోబర్ 17 : నిజామాబాద్ జిల్లాలోని మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనున్నది. శుక్రవారం పలువురి నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు.
నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 36 మద్యం షాపులకు 258 దరఖాస్తులు, ఆర్మూర్ స్టేషన్ పరిధిలోని 25 షాపులకు 125, బోధన్ స్టేషన్ పరిధిలోని 18 షాపులకు 131, భీమ్‌గల్ స్టేషన్ పరిధిలోని 12 షాపులకు 106, మోర్తాడ్ స్టేషన్ పరిధిలోని 11 షాపులకు 112 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. ఇప్పటివరకు జిల్లాలోని 102 వైన్‌షాపులకు మొత్తం 732 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.