Nizamabad | వినాయక్‌నగర్, అక్టోబర్ 10 : నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 600 పోలీసు సిబ్బంది తో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. సిబ్బంది తమకు కేటాయించిన డ్యూటీ పాయింట్ నుండి ఎక్కడికి వెళ్లొద్దని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం సిబ్బందితో నిర్వహించిన బ్రీపింగ్ సమావేశంలో సీపీ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసినా త్వరితగతిన తమపై స్థాయి అధికారులకు తెలియజేయాలని ఆదేశించారు. అనునిత్యం సిబ్బంది అలర్ట్ గా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డితో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీసీఎస్, సీటీసీ, ట్రాఫిక్ ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, నాగేంద్ర చారి, రాజశేఖర్, మస్తాన్ అలీ, వివిధ సర్కిల్ ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.