కంఠేశ్వర్, సెప్టెంబర్ 6: నిజామాబాద్ జిల్లా (Nizamabad) కేంద్రంలోని 20 డివిజన్ కంఠేశ్వర్ బ్యాంకు కాలనీలో ఇళ్ల మధ్యలో ఒక భారీ వృక్షం విద్యుత్ తీగలపై వంగి ప్రమాదకరంగా ఉంది. నేలకోరగాల్సిన చెట్టు కేవలం కాలనీకి సంబంధించిన వీధి బోర్డు, స్తంభాల కట్టినటువంటి ఇతర కేబుల్ ల సహాయంతో ఆగి ఉంది. ఏ సమయంలో పడిపోతుందో తెలియక కాలనీ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రతి నెల విద్యుత్ నిర్వహణలో భాగంగా చెట్లు తీసివేస్తున్నాం అని చెబుతున్న విద్యుత్ అధికారులకు ప్రమాదకరంగా కేబుల్ పై ఒరిగి ఉన్న చెట్టు కనిపించట్లేదా అని కాలనీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
చిన్నపిల్లలను అటువైపుగా పంపడానికి భయపడుతున్నారు .అసలే అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒకవేళ చెట్టు పూర్తిగా పడిపోయి విద్యుత్ వైర్లు తెగిపోయి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్టును తొలగించి ప్రమాదం జరగకుండా చూడాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.