Arrested | వినాయక్ నగర్, జూన్ 21 : నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి వద్ద నుండి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి వెల్లడించారు. శనివారం ఉదయం డ్యూటీ లో ఉన్న సిబ్బంది నిజామాబాద్ రైల్వే స్టేషన్ లోని ఒకటవ ప్లాట్ ఫార్మ్ మీద విధులు నిర్వస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ కన్పించడం తో సదరు వ్యక్తిని రైల్వే పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
విచారించగా నిజామాబాద్ నగరంలోని ద్వారక నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మాజీద్ అని తెలిపాడు. అతడి వద్ద తనిఖీ చేయగా మూడు విలువైన సెల్ ఫోన్లు లభించడంతో అవి ఎక్కడినుండి తెచ్చావని రైల్వే పోలీసులు నిలదీశారు. దీంతో సదర అనుమానితుడు తాను ఈ సెల్ ఫోన్లను నాగర్ సోల్, షిరిడి ట్రైన్ లలో ప్రయాణికుల వద్ద నుంచి దొంగిలించినట్లు అంగీకరించాడు. అలాగే ట్రైన్ లో దొంగతనం చేసేందుకు వచ్చినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
దీంతో నిందితుడు సయ్యద్ మజీద్ ను అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరిచినట్లు ఎస్సై వెల్లడించారు. నిందితుడిని చాక చక్యంగా పట్టుకునున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేందర్, గురూదాస్ తోపాటు కానిస్టేబుల్ రాములు ను ఈ సందర్భంగా రైల్వే ఎస్సై సాయి రెడ్డి అభినందించారు.