సూక్ష్మపోషకాలు వరి పంటకు లాభాలు
వరి దిగుబడులు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్థూలపోషకాలతోపాటు సూక్ష్మపోషకాల లోపంతో మొక్క ఎదుగుదల మందగిస్తుంది. వరి, ఇతర ప్రధాన పంటల్లో జింక్ పోషక లోపం ప్రధాన సమస్యగా మారింది.
- జింక్ లోపంతో వరిలో సమస్యలు
- అధిక మోతాదులో యూరియా వాడొద్దు
- సస్యరక్షణ చర్యలతో పంటలను కాపాడుకోవాలి
- వరి సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి
ఇందల్వాయి, ఫిబ్రవరి 4: వరి దిగుబడులు తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. స్థూలపోషకాలతోపాటు సూక్ష్మపోషకాల లోపంతో మొక్క ఎదుగుదల మందగిస్తుంది. వరి, ఇతర ప్రధాన పంటల్లో జింక్ పోషక లోపం ప్రధాన సమస్యగా మారింది.
జింక్ లోపానికి ప్రధాన కారణాలు..
- నేలలో లవణాల సాంద్రత అధికంగా ఉండడం, ఇసుక నేలల్లో సేంద్రియ పదార్థం తక్కువగా ఉంటే జింక్ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. నేల ఒత్తిడితోనూ మొక్కలకు జింక్ అందదు.
- నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నా జింక్ లోపం ఏర్పడుతుంది. మురుగు నీటి పారుదల సౌకర్యం లేని పల్లపు భూముల్లో వరుస సీజన్లలో వరి పండించే భూముల్లో, సున్నపు నేలల్లో ఈ పోషక లోపం కనిపిస్తుంది.
- భాస్వరం ఎరువులు ఎక్కువగా వాడడం, భూమిలో మెగ్నీషియం అధికంగా ఉన్నప్పుడు, ఉదజని సూచిక PH7 దాటినప్పుడు ఈ పోషక లోపం ఏర్పడుతుంది. పంట మార్పిడి పాటించకపోతే జింక్ లోపం పెరగవచ్చు.
- నేలల్లో ఎక్కువ రోజులపాటు నీరు నిల్వ ఉంటే మొక్కల వేర్లకు జింక్ సరిగా అందదు. రసాయన ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాష్‌ను అధికంగా వినియోగించడం, జీవన ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడకపోవడంతో వరిలో జింక్ లోపం కనిపిస్తుంది.
జింక్ లోపాన్ని గుర్తించడం ఎలా?
- వరి నారుమడిలో, నాట్లు వేసుకున్న 20-40 రోజుల వరకు జింక్ లోపం కనిపిస్తుంది. మొక్కలు గిడసబారి చివరి ఆకులు కుచ్చుగా మారుతాయి.
- ఆకులు సాధారణ పరిమాణం కన్నా పెళుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి. ముదురు ఆకుల చివరి భాగంలో ఈనెల ఇరువైపులా ఇటుక రంగు మచ్చలు ఏర్పడుతాయి. అవి ఆకు అంతటా వ్యాపించి లేత ఎరుపు లేదా ఇత్తడి రంగులోకి మారుతాయి.
అవసరం మేర యూరియా వాడాలి.. - 46 శాతం నత్రజని కలిగిన యూరియా అత్యంత శక్తిమంతమైన ఎరువు. తెల్లని గుళికల రూపంలో ఉన్న ఈ ఎరువు వెదల్లేందుకు అనుకూలంగా, నీటిలో తేలికగా కరిగి మొక్కకు అందుబాటులో ఉంటుంది.
విచక్షణా రహితంగా వాడితే ఏమవుతుంది? - యూరియా తేలికగా నీరు, గాలిలో కలిసిపోతుంది. అజాగ్రత్తగా ఉంటే గాలి, నీరు కాలుష్యం ఏర్పడుతుంది.
- పైర్లు విపరీతంగా పెరిగి పడిపోతాయి. పూత ఆలస్యంగా రావడంతోపాటు పంట కాలం పెరుగుతుంది. తాలు గింజలు ఏర్పడుతాయి.
- యూరియాతో చీడపీడలు త్వరగా ఆశిస్తాయి.
- పెట్టుబడులు పెరిగి దిగుబడి తగ్గిపోతుంది.
యూరియాతో లాభం ఎలా పొందాలి?

పైరుకు నత్రజని అవసరం మొదటి నుంచి చివరి వరకూ ఉంటుంది. 3-4 దఫాలుగా యూరియా వేయాలి. యూరియా వేసేటప్పుడు తేమ ఉండేలా చూడాలి. వరి నాట్లు వేసేటప్పుడు, పిలక, చిరుపొట్ట దశలో వేయాలి. నీరు తీసేసి బురద పదును మీద చల్లి 24-48 గంటల తర్వాత నీరు పెట్టాలి. వేపపిండి కలిపి యూరియా వేసుకుంటే నత్రజని సామర్థ్యం పెరగడంతోపాటు చీడపీడలను అరికడుతుంది. (50 కిలోల యూరియాలో 5 కిలోల వేపపిండి కలపాలి) భూమిలో తగిన తేమ లేనప్పుడు ఎరువును వేసిన తర్వాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు, సమస్యాత్మక భూములలో నత్రజని అందించడానికి సాధారణంగా అన్ని పంటల మీద, ఫలవృక్షములపై 2-3 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. మెట్ట పైర్లలో యూరియా వెదజల్లడం లేదా మొక్క పక్కనే గుంతలో వేసి మట్టి కప్పితే యూరియా వృథాను అరికట్టవచ్చు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
- Tags
- fertilizers
- nitrogen
- PH7
- Phosphorus
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

