Bala Mitra Foundation | కోటగిరి, ఆగస్టు 23 : బాలమిత్ర ఫౌండేషన్ హైదరాబాద్ వారి సేవలు అభినందనీయమని ఐసీడీఎస్ బోధన్ సీడీపీవో పద్మజ అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో రచ్చగల్లి అంగన్వాడీ కేంద్రంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పప్పు కుక్కర్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్ సీడీపీవో పద్మజ హాజరై మాట్లాడారు. బాలమిత్ర ఫౌండేషన్ వారు కోటగిరి లోని 5 అంగన్వాడీ కేంద్రాలకు పప్పు కుక్కర్లు పంపిణీ చేసి చేయూతనందించడం అభినందనీయమన్నారు.
మిగతా అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఏదైనా అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. ఇటీవల పలు అంగన్వాడీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలమిత్ర ఫౌండేషన్ ప్రతినిధి రమేష్ బాబు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు పప్పు కుక్కర్లతో పాటు ఇంకా ఏదైనా అవసరమైతే బాలమిత్ర ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మరింత సాయం చేస్తామని భరోసా కల్పించారు. అంగన్వాడీ కేంద్రాలకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ కొమురవ్వ, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ ఉదయ్ చందర్, స్థానిక అంగన్వాడీ టీచర్లు జమున, కట్టు కృష్ణకుమారి, కళావతి, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.