ప్రజావాణి.. పట్టించుకునేవారేరి
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అభాసుపాలవుతున్నది. తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు నిరాశే ఎదురవుతున్నది.
- కార్యక్రమ నిర్వహణ అస్తవ్యస్తం
- పలు శాఖలకు చెందిన అధికారులు గైర్హాజరు
- కలెక్టరేట్ ఆవరణలో పూల మొక్కలకు రక్షణ కరువు
- కనిపించని సెక్యూరిటీ గార్డులు
ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 5: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అభాసుపాలవుతున్నది. తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు నిరాశే ఎదురవుతున్నది. ప్రజావాణి కార్యక్రమానికి కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు గైర్హాజరవడం, వందల సంఖ్యలో వస్తున్నవారిని క్రమపద్ధతిలో నిలువరించకపోవడంతో అధికారులకు వినతిపత్రాలు, ఫిర్యాదులు ఇవ్వడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండగా.. వేల్పూర్ మండలం పచ్చల నడ్కుడ గ్రామస్తులు సుమారు 50 మంది లోపలికి చొచ్చుకు వచ్చారు. జాన్కంపేట్, పచ్చల నడ్కుడ గ్రామాల మధ్య ఉన్న వాగు సమస్యను పరిష్కరించాలని కోరుతూ బైఠాయించి, నిరసన వ్యక్తంచేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
కానరాని సెక్యూరిటీ
సమావేశపు హాలులోకి పరిమిత సంఖ్యలో ఫిర్యాదుదారులను పంపించాల్సి ఉండగా.. ఒకేసారి 50 మంది చొచ్చుకురావడంతో సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజావాణి కార్యక్రమంలో ఇలా నిరసన తెలుపడం తొలిసారి కావడం గమనార్హం.
ఫిర్యాదుల వెల్లువ
సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 97 వినతులు రాగా.. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు రాకపోవడంతో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతోపాటు పలువురు అధికారులు స్వీకరించారు. నగరానికి చెందిన రాజయ్య, సరోజ, గంగాధర్ దివ్యాంగులు తమకు ఆసరా పింఛన్ రావడంలేదని ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. నగరంలోని 171,172 సర్వేనంబర్‌లోని ప్రభుత్వ భూమిలో రెండేండ్లుగా గుడిసెలు వేసుకొని 300 కుటుంబాలు నివసిస్తున్నాయని, తమను రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, డీపీవో జయసుధ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పూల మొక్కలకు రక్షణ కరువు
న్యూ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రంగురంగుల పూలమొక్కలకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక పని నిమిత్తం వచ్చే వారు తమకు నచ్చిన పూల మొక్కలను యథేచ్ఛగా తీసుకెళ్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

