‘ఫంక్షనల్ వర్టికల్’ సిబ్బంది పనితీరు భేష్
రాష్ట్ర పోలీసు శాఖలో ‘ఫంక్షనల్ వర్టికల్' పని విధానంలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు డ్యూటీలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక రివార్డులు ప్రకటించారు.
- అభినందించిన డిప్యూటీ కమిషనర్
- ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు
నిజామాబాద్ క్రైం, జనవరి 21 : రాష్ట్ర పోలీసు శాఖలో ‘ఫంక్షనల్ వర్టికల్’ పని విధానంలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు డ్యూటీలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక రివార్డులు ప్రకటించారు. డిసెంబర్ నెల పనితీరు ఆధారంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న 13 ఫంక్షనల్ వర్టికల్లో వివిధ కేటగిరీల్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు శనివారం ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో నిజామాబాద్ త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై ఆర్.లక్ష్మయ్య, జక్రాన్‌పల్లి ఎస్సై కె.శ్రీకాంత్, రెంజల్ ఎస్సై పి.సాయన్న, టూ టౌన్ ఏఎస్సై లక్ష్మణ్‌తో పాటు కోర్టు డ్యూటీ కానిస్టేబుల్, ట్రాఫిక్ సిబ్బంది, నందిపేట్, మెండోరా, మోర్తాడ్, జక్రాన్‌పల్లి, కమ్మర్పల్లి, నవీపేట్, బోధన్ స్టేషన్ రైటర్, రిసెప్షనిస్ట్‌లు మొత్తం 22 మంది సిబ్బందిని సీపీ అభినందించారు. కార్యక్రమంలో ఎన్ఐబీ ఇన్స్పెక్టర్ ముఖీద్ పాషా, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

