HomeNizamabadThe Momentum Of Unanimity Continues In The Local Body Elections
ఏకగ్రీవాల జోరు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతున్నది. కొన్నిచోట్ల అభ్యర్థులు స్వచ్ఛందంగా తప్పుకోగా, మరికొన్ని చోట్ల నేతల ఒత్తిడితో నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలిసింది.
నమస్తే యంత్రాంగం, డిసెంబర్ 6: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు కొనసాగుతున్నది. కొన్నిచోట్ల అభ్యర్థులు స్వచ్ఛందంగా తప్పుకోగా, మరికొన్ని చోట్ల నేతల ఒత్తిడితో నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు తెలిసింది.
మాక్లూర్ మండలంలో 28 జీపీలు ఉంటే, 7 చోట్ల పోటీ లేకుండా పోయింది. కొత్తపల్లి, అమ్రాద్ తండా, మెట్పల్లి, ముత్యపల్లి, మాదాపూర్, గంగరమంద, సింగంపల్లి సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని అధికారులు ప్రకటించారు.
ధర్పల్లి మండలంలో 6 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మోదిన్సాబ్ తండా, మద్దుల్ తండాలను మాత్రమే ఏకగ్రీవమైనట్లు అధికారికంగా ప్రకటించారు. సీతాయిపేట్, నడిమి తండా, గుడి తండా, ఇందిరానగర్ తండా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనప్పటికీ, కలెక్టర్ నుంచి ఎన్వోసీ వచ్చాక అధికారికంగా ప్రకటించనున్నారు.
సిరికొండ మండలంలో 6, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి మండలాల్లో 3 చొప్పున, మోపాల్ మండలంలో ఒకటి చొప్పున ఏకగ్రీవమయ్యాయి.
నాగిరెడ్డిపేట మండలంలో 6 సర్పంచ్, 103 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
లింగంపేట మండలం లింగంపల్లి పాలకవర్గం ఏకగ్రీవమైంది.
నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ తండా సర్పంచ్‌తో పాటు 8 వార్డు స్థానాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.