జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావుకు ముల్లంగి(బీ), బొంకన్పల్లి గ్రామాల రైతుల సన్మానం
మాక్లూర్, జనవరి 10: మండలంలోని ముల్లంగి(బీ), బొంకన్పల్లి గ్రామాల పరిధిలోని వెయ్యి ఎకరాల ఆయకట్టుకు నీరందించడానికి నూతనంగా నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ రూ.11.71 కోట్లు మంజూరు చేశారని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు తెలిపారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడారు. ఇది రెండు గ్రామాల ప్రజలకు శుభవార్త అని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న రైతుల కల నెరవేరిందన్నారు. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ధర్మోరా ఎత్తిపోతల ట్యాంకు నుంచి రెండు గ్రామాలకు పైప్‌లైన్ ద్వారా నీరందుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, వేముల, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రెండు గ్రామాల ప్రజలు జడ్పీ చైర్మన్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాస్త ప్రభాకర్, కేసీఆర్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు రమణారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యం, నాయకులు శ్యాంరావు, బూరోల్ల అశోక్, మనోహర్ రావు, మేడే సాయిలు, అమృత్, సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ పూజిత, రైతులు ఆశన్న, కాంతారావు, సాగర్‌రావు, సంపత్, నాగారావు పాల్గొన్నారు.