మాక్లూర్, జనవరి19: ఓ నవజాత శిశువును చెట్టుకింద వదిలి వెళ్లిన అమానవీయ ఘటన మండలంలోని చిక్లీ శివారులో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిక్లీ శివారులోని నందిపేట్ జన్నేపల్లి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టు పక్కన ముళ్ల పొదల్లో ఆదివారం ఉద యం ఓ గుర్తు తెలియని మహిళ నవజాత శిశువు(ఆడ)ను వదిలి వెళ్లింది. అటుగా వాకింగ్‌కు వెళ్లిన యువకులు ఏడుపును విని శిశువు ఉన్నట్లు గుర్తించారు.
వెంటనే విషయాన్ని గ్రామ కార్యదర్శితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అంగన్వాడీ, ఆశ వర్కర్ల సహాయంతో శిశువును అం బులెన్స్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషయమై ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించామని, కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మానవత్వం లేని తల్లి ఈ ఘటనకు పాల్పడిందోనని ప్రజలు స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.