బోధన్ : బోధన్ పట్టణ శివారులోని ప్రజ్ఞ హైస్కూల్( Pragna High School ) వార్షికోత్సవం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ( ACP Srinivas ) మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్య సాధన కోసం కష్టపడి చదవాలని, క్రమశిక్షణతో మెలగాలని అన్నారు. సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మాదక ద్రవ్యాలకు ( Drugs ) అలవాటు కారాదని, దీనివల్ల జీవితాలు నాశనం అవుతాయని హితబోధ చేశారు. వార్షికోత్సవంలో ప్రజ్ఞ హైస్కూల్ చైర్మన్ చౌడమ్మ, కరస్పాండెంట్ చౌడారెడ్డి, బోధన్ సీఐ వెంకటనారాయణ, మధుమలంచ డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ యార్లగడ్డ శ్రీనివాస్, బోధన్ తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబిరెడ్డి, హైస్కూల్ ప్రతినిధులు బ్రహ్మారెడ్డి రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.