కామారెడ్డి, మే 19 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నది. శుక్రవారం బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో 44.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత పెరగడంతో జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు.
భిక్కనూరు మండల కేంద్రంలో 42.3 డిగ్రీలు, గాంధారి మం డలం సర్వాపూర్‌లో 42 డిగ్రీలు, మద్నూర్ మండలం డోంగ్లీలో 41.7, పిట్లం మండల కేంద్రంలో 41.5, మద్నూర్ మండలం మేనూర్‌లో 41.4, బీర్కూర్‌లో 41.4 డిగ్రీలు, రామారెడ్డిలో 41.3, జుక్కల్‌లో 40.7, నిజాంసాగర్ మండలం మగ్దుంపూర్‌లో 40.3, బిచ్కుందలో 40.3, నిజాంసాగర్ మండలం హసన్‌పల్లిలో 40.3, బొమ్మన్‌దేవ్‌పల్లిలో 40.2, దోమకొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజంపేట మండలం ఆర్గొండలో అత్యల్పంగా 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.