ఖలీల్‌వాడి, జనవరి 2 : 1969 ప్రత్యేక తెలంగాణోద్యమ నాయకుడు, కవి, రచయిత, స్నేహశీలి డాక్టర్ ఎం.శ్రీధర్‌రెడ్డి సోమవా రం హైదరాబాద్‌లో కన్ను మూ శారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. శ్రీధర్‌రెడ్డికి జిల్లాతో అనుబంధా న్ని గుర్తు చేసుకున్నారు. ఆయన పలు సందర్భాల్లో నిజామాబాద్‌ను సందర్శించారు. తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలో ఘనపురం దేవేందర్, తిరుమల శ్రీనివాస్ ఆర్యా రచించిన ‘నుడుగు పిడుగులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం 2011 ఆగస్టు 13న నిర్వహించగా ఆయన హాజరయ్యారు. 2017 అక్టోబర్ 22న సీహెచ్.మధు రచించిన ‘జ్వలిత గీతా సంచలనం’ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు.2018లో తెలంగాణ భాషా సాహితీ, సాంస్కృతిక వేది క ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నా రు. శ్రీధర్‌రెడ్డి మృతి పట్ల తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, తెలంగాణ సాహితీ సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు పంచరెడ్డి లక్ష్మణ్, ఎనిశెట్టి శంకర్, వీపీ చందన్రావు, తిరుమల శ్రీనివాస్ ఆర్య, గుత్ప ప్రసాద్, సాయిబాబు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.