ఖలీల్వాడి, మార్చి 7 : రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న ఇందూరు నగరంలో అధునాతన భవనాలు, విల్లాలు, అపార్టుమెంట్లు, ఇండ్ల నిర్మాణాలు జోరందుకుంటున్నా యి. ప్రధాన నగరాలకు దీటుగా ప్రగతి సాధిస్తున్నది. మెరుగైన జీవన ప్రమాణాల నగరంగా ఖ్యాతి గడించిన ఇందూరులో నివాసం ఉండడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి వారి కోసం ఇక్కడ ఎన్నో రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ సంస్థలు వెలిశాయి. వారి అభిరుచులకు అనుగుణంగా నిర్మాణాలు చేపడుతున్నాయి. ఇం దులో భాగంగా నగరంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న వేణుమాల్ (హోటల్ నిఖిల్ సాయి)లో నమస్తే తెలంగాణ , తెలంగాణ టుడే ఆధ్వర్యంలో శని, ఆదివారాలు ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రముఖ రియల్ ఎస్టేట్, నిర్మాణ సంస్థలు ఒకే వేదికపై కొలువుదీరనున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనకు జిల్లావాసులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
మెయిన్ స్పాన్సర్ వాసవి గ్రూప్స్, కో -స్పాన్సర్ శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్(ఎస్వీసీ), మకుట బిల్డర్స్ (క్రౌన్ ఆఫ్ ఎక్స్లెన్స్), అసోసియేషన్ విత్ : శ్రీ అశోకా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఐశ్వర్యం హోమ్స్, రాయల్ ఓక్ నిజామాబాద్, బాలాజీ డివైన్, ఏపీడీ డెవలపర్స్, శ్రీ గోవిందసాయి బిల్డర్స్ అండ్ డెవలపర్స్, శ్రీ ఎస్ఎల్ ఎన్ ప్రాపర్ట్సీ ప్రైవేట్ లిమిటెడ్, అంకురమ్, భూమి స్పేస్, సన్యుగ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ నార్త్ క్రెస్ట్, మయూర సూపర్ లివింగ్, ఆదూరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పాటు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటాపవర్ సొలారూఫ్, కపిల్ ప్రాపర్టీస్, టీఎంఆర్ గ్రూప్, అక్షయ ఎం టర్ ప్రైజెస్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.