రేపు గురుకుల ప్రవేశపరీక్ష
టీఎస్‌డబ్ల్యూఆర్, టీటీడబ్ల్యూఆర్, టీఆర్ఈఐ, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 11న పరీక్ష నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమన్వయాధికారిణి సంగీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
డిచ్పల్లి/కామారెడ్డి, ఫిబ్రవరి 9 : టీఎస్‌డబ్ల్యూఆర్, టీటీడబ్ల్యూఆర్, టీఆర్ఈఐ, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం ఈ నెల 11న పరీక్ష నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమన్వయాధికారిణి సంగీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్లు https://tgcet.cgg.gov.in సైట్లో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వారికి కేటాయించిన కేంద్రాలకు 11వ తేదీన ఉదయం 10 గంటలలోపు చేరుకోవాలని తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 17 సెంటర్లను ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్, ప్యాడ్, హాల్ టికెట్‌ను తప్పకుండా వెంట తీసుకురావాలని సూచించారు.
కామారెడ్డి జిల్లాలలో ఏర్పాట్లు పూర్తి..
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాటు పూర్తిచేసినట్లుకామారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లాలో మొత్తం 3,986 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని ఆయన సూచించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

