నిజామాబాద్ ఖలీల్ వాడి: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్ ఆర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, కాలేజీ కరస్పాండెంట్ హరిత గౌడ్, కళాశాల డైరెక్టర్ హర్షిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రాజేందర్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ భూమయ్య, కళాశాల కోఆర్డినేటర్ శ్యామ్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ తక్షశిల, అధ్యాపకుల బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు.
అనంతరం కళాశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థికి విలువైన పాఠ్య గ్రంథం ఉపాధ్యాయుడు అని చెప్పారు. ఒక విద్యార్థిని ఉన్నత స్థాయి తీర్చిదిద్దాలన్న ఉపాధ్యాయుడే మొదటి పాత్ర వహిస్తాడని తెలిపారు. దేశాన్ని పరిపాలించాలన్నా ఉపాధ్యాయుడి పాత్ర గణనీయమని కొనియాడారు.