Nizamabad | రెంజల్, సెప్టెంబర్ 8 : రెంజల్ మండలంలోని కందకుర్తి జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంప్లెక్స్ హెచ్ఎం కే ఆదినారాయణ.పాఠశాల చైర్మన్ హసీనా బేగం హాజరయ్యారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు కే ఆదినారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవను దేశాభివృద్ధికి మార్గమని పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయుడి స్థానం ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులు జ్ఞానం యొక్క వెలుగును వెతకాలని, టగురువును గౌరవించాలని సూచించారు. అనంతరం హెచ్ఎం అబ్దుల్ కరీం మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధన. వసతులు సౌకర్యాలను కల్పిస్తూ విద్య ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన కార్డులు, పూల బొకేలను ఉపాధ్యాయులకు అందజేశారు. అనంతరం పాఠశాల తరపున హెచ్ఎం అబ్దుల్ కరీం శాలువాతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు.