వినాయక నగర్ : నిజామాబాద్ నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ (Task force team) పోలీసులు దాడులు చేశారు. నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృంధం శుక్రవారం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీ ప్రియ నగర్‌లోని వ్యభిచార గృహంపై దాడి చేశారు.
టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ సిబ్బంది దాడులు చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలి తో పాటు ఇద్దరు విటులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు ఇద్దరు బాధిత మహిళలను గుర్తించారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ.670 నగదు , 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన వారిని నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు అప్పగించారు.